తిరుమల ఘటన పై రాహుల్ గాంధీ ట్వీట్..! 19 h ago
తిరుమలలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. కాగా ఈ ఘటనలో మొత్తం 40 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన పై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి అని అన్నారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరుతున్నానని కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు